‘PS – 2’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘PS – 2’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 24, 2023 9:00 PM IST

చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, జయరాం వంటి వారు కీలక పాత్రల్లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ PS 2. గత ఏడాది రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న PS 1 కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతుండగా దీని పై అన్ని భాషల ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న PS 2 మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని మార్చి 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాగా ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి దీనిని భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు