భారీ ధరకు అమ్ముడైన పవన్ – త్రివిక్రమ్ సినిమా రైట్స్ !

13th, September 2017 - 09:02:28 AM


పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న చిత్రంపై ఏ స్థాయి హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరి కాంబోలో ‘ జల్సా, అత్తారింటికి దారేది’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఈ సినిమా కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రేజ్ వలనే చిత్ర హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా యొక్క నైజాం హక్కుల్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రూ.29 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకున్నారట.

‘బాహుబలి’ తర్వాత భారీ ధర పలికిన సినిమా ఇదే కావడం విశేషం. 2018 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా పరిశ్రమలో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా కుష్బు, బోమన్ ఇరానీ వంటి సీనియర్ నటులు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.