పవన్ సినిమా సంక్రాంతికైతే చరణ్ సినిమా డిసెంబర్లోనేనా !


ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి రెండు భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా కాగా మరొకటి సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’. వీటిలో సగం పైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న చరణ్ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. సంక్రాంతి అంటే చరణ్ కు బాగా కలిసొచ్చిన సీజన్ కూడా. కానీ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల చిత్రాన్ని కూడా అదే సంక్రాంతికి రిలీజ్ చేస్తారని నెల క్రితమే వార్త బయటికొచ్చింది.

దీంతో చరణ్ ఒక నెల ముందుకు జరిగి డిసెంబర్ నెలలో వస్తాడని అన్నారు. కానీ దీనిపై ఇన్నిరోజులు క్లారిటీ రాలేదు. కానీ తాజాగా విడుదలైన పవన్ సినిమా మ్యూజిక్ వీడియోలో జనవరి 10న రిలీజ్ అని కన్ఫర్మ్ చేసేశారు. దీన్నిబట్టి చరణ్ సంక్రాంతి బరిని వదిలి డిసెంబర్ పోటీలోకి దిగడం ఖాయమని అంటున్నారు. మరి చరణ్ బాబాయ్ కోసం తనకు కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ ను త్యాగం చేస్తాడో లేకపోతే కొంచెం గ్యాప్ తీసుకుని అదే నెలలో వస్తాడో చూడాలి.