చివరి షెడ్యూల్లో పవన్, త్రివిక్రమ్ ల సినిమా !
Published on Nov 22, 2017 10:28 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల సినిమా ఇటీవలే యూరప్లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం తర్వాతి షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. ఈ నవంబర్ 27వ తేదీ నుండి కాశీలో షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తికానుంది. పవన్ కళ్యాణ్ తో పాటు కీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు ఈ కూడా ఈ షూట్లో పాల్గొననున్నారు.

ఈ నెల 25న ఈ సినిమా ఫస్ట్ లుక్ రీలీజవుతుందని తెలుస్తుండగా రెండవ పాట కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ తో పవన్ ఇదివరకు చేసిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ సినిమాలు మంచి విజయాలుగా నిలవడంతో ఈ సినిమాపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతోంది. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

 
Like us on Facebook