బల్గెరియా షెడ్యూల్ ముగించిన పవన్ టీమ్ !
Published on Nov 15, 2017 5:03 pm IST

పవన్ కళ్యాణ్ 25వ సినిమా ప్రస్తుతం బల్గెరియాలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ ముగిసినట్టు తెలుస్తోంది. దీంతో టీమ్ మొత్తం హైదరాబాద్ తిరుగు ప్రయాణమై రేపు ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. పవన్ కూడా మిగతా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఇండియా, యురోపియా బిజినెస్ ఫోరం ప్రధానం చేయనున్న గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును స్వీకరించేందుకు 17, 18 తేదీల్లో లండన్ వెళ్లనున్నారు.

అక్కడి నుండి తిరిగొచ్చాక పార్టీ పనుల్ని చక్కబెట్టుకుని అనంతరం సినిమా షూటింగ్లో పాల్గొంటారట. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ ఏమిటనేది తెలియనుంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్నీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఫలితంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook