పవన్ పుట్టినరోజునాడు సంథింగ్ స్పెషల్ ఇస్తామంటున్న టీమ్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. వీరిద్దరి కలయికలో వచ్చిన గత సినిమాలన్నీ హిట్లుగా నిలవడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాల మూలంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరుగుతోంది. ఇక ఫ్యాన్స్ అయితే టీమ్ నుండి కొత్త విశేషాలేమన్నా బయటికొస్తాయేమోనని ఎదురుచూస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ లుక్ సంగతి ఎలా ఉన్నా ఒక సప్రైజ్ మాత్రం ఖాయమని, అది కూడా సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉందని టాక్ వినబడుతోంది. కానీ ఆ స్పెషల్ ఏమిటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిర్మాణ సంస్థ హారికా, హాసిని క్రియేషన్స్ కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ సప్రైజ్ ఏంటో తెలియాలంటే ఇంకో రోజు ఆగాల్సిందే.