విదేశీ టూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్ !
Published on Jul 5, 2017 8:29 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి విదితమే. గతంలో ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి భారీ వోయిజాయాలను అందుకున్న ఈ హిట్ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విదేశాలకు పయనమవనుంది.

ఈ జూలై నెలాఖరున టీమ్ మొత్తం బల్గెరియా వెళ్లనున్నారు. అక్కడే ప్రధాన తారాగణమైన పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ల మీద రెండు పాటలను చిత్రీకరిస్తారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ కు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా సినిమా ఫస్ట్ లుక్, విడుదల తేదీలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook