పవన్ , త్రివిక్రమ్ ల సినిమా టైటిల్ వివరాలు !
Published on Nov 23, 2017 6:28 pm IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమా ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా యొక్క టైటిల్ ను ఈ నెల 27న సోమవార్న్ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ప్రహకారంలో ఉండగా చిత్ర యూనిట్ అదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.

ఈ వార్తతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మొదటి పాట ‘బయటికొచ్చి చూస్తే’ కు మంచి ఆదరణ లభించగా త్వరలోనే రెండవ పాటను కూడా రిలీజ్ చేయనున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook