యూఎస్ లో జోరుగా ‘గరుడవేగ’ ప్రమోషన్లు !

22nd, October 2017 - 01:08:30 PM

సీనియర్ హీరో డా. రాజశేఖర్ ‘పిఎస్వి గరుడవేగ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మధ్యనే విడుదలైన టీజర్ మంచి ఆదరణ పొందటంతో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్రం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను పొందగా ఇంకాస్త ఎక్కువగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీ ప్రమోషన్లను చేపడుతున్నారు టీమ్.

ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. యూఎస్ లోని కనెక్టికట్ లో ప్రేక్షకుల కోసం టీజర్, ట్రైలర్లను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రాజశేఖర్ కు మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతున్నారు. రాజశేఖర్ సరసన హీరోయిన్ గా పూజా కుమార్, ఇతర ప్రధాన తారాగణంగా కిశోర్, అలీ, శ్రద్దా దాస్, నాజర్, అవసరాల శ్రీనివాస్, పృథ్వి రాజ్ వంటి వారు నటిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 3న రిలీజ్ చేయనున్నారు.