ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ హీరోయిన్ ఖరారు !
Published on Nov 16, 2017 11:40 am IST

జయం మూవీస్‌ పతాకంపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రం ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. సిరిపురపు విజయభాస్కర్‌ సమర్పణలో జి.విజయకుమార్‌ గౌడ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు తేజ, మరియు వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తీస్తోన్నారు. కోట్ల జనాల హృదయాలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ జీవితాన్ని అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉండబోతుంది.

ఈ సినిమాలో లక్ష్మి పార్వతి పాత్రలో మొదట లక్ష్మి రాయ్ ను నటించబోతుందని వార్తలు వచ్చాయి. ఆమెను చిత్ర యూనిట్ సంప్రదించింది. కాని లక్ష్మీరాయ్ డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఆమె ఈ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది. తాజాగా ఆమె స్థానంలో పూజా కుమార్ ను తీసుకున్నారని దర్శకుడు తెలిపాడు.

 
Like us on Facebook