‘పులి’ స్పెషల్ షోకి రెస్పాన్స్ బాగుంది.!

Puli
సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోని స్టార్ నటీనటులతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘పులి’. తమిళ స్టార్ హీరో ఇలయథలపథి విజయ్ హీరోగా, హాట్ బ్యూటీస్ శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ లు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఆని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒకేసారి తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అన్ని చోట్లా ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

కోలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం విజయ్ నిన్న పులి సినిమాని తన కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ మరియు సన్నిహితులకు కలిపి స్పెషల్ గా షో వేసాడు. ఈ సినిమా చూసిన వారికి సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం.. సినిమా బాగుందని, చూసిన ప్రతి ఒక్కరికీ సినిమా బాగా నచ్చిందని అంటున్నారు. ప్రీ రిలీజ్ కి ముందే ఇలాంటి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ఈ సినిమాని 3 భాషల్లో కలుపుకొని సుమారు 3000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మరి విజయ్ సన్నిహితులు చెబుతున్న పాజిటివ్ రిపోర్ట్స్ నిజమా కాదా అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Exit mobile version