“ధమాకా” పల్సర్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on May 25, 2023 8:33 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యిన సినిమా “ధమాకా” కూడా ఒకటి. మరి దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ మ్యూజికల్ గా కూడా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఓ రకంగా సంగీత దర్శకుడు భీమ్స్ ఇచ్చిన ఒక్కో చార్ట్ బస్టర్ సాంగ్ కూడా ఈ సినిమా విజయంలో చాలా భాగస్వామ్యం పంచుకుంది అని చెప్పొచ్చు.

ఇలా ఈ సినిమాలో హిట్ అయ్యిన అన్ని సాంగ్స్ లో ఆఫ్ లైన్ లో సెన్సేషన్ అయినటువంటి పల్సర్ బైక్ సాంగ్ కి రీమిక్స్ చేయగా దీనికి కూడా థియేటర్స్ దద్దరిల్లాయి. మాస్ మహారాజా, హీరోయిన్ శ్రీలీల ల మాస్ ఎనర్జీ ఈ సాంగ్ ని మరింత ఎనర్జిటిక్ గా మార్చాయి. ఇక యూట్యూబ్ లో కూడా ఈ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దుమ్ము లేపడం కేజ్రీగా మారింది. మరి ఈ సాంగ్ ఏకంగా 99 మిలియన్ వ్యూస్ మార్క్ ని అయితే టచ్ చేసి 100 మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది. మొత్తానికి అయితే ఈ సాంగ్ హవా ఇలా నడుస్తుంది.

సంబంధిత సమాచారం :