క్యూరియాసిటి ను పెంచుతున్న పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం టీజర్!

Published on Dec 6, 2021 5:22 pm IST

ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాత్తు మరణం ప్రేక్షకులను, అభిమానులను తీవ్ర దిగ్ర్భాంతి కి గురి చేసింది. అయితే పునీత్ రాజ్ కుమార్ తన చివరి చిత్రాన్ని మాత్రం పూర్తి చేయడం జరిగింది. అందుకు సంబంధించిన టీజర్ ను, టైటిల్ ను నేడు చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది.

చిత్ర యూనిట్ గంధాడ గుడి అనే టైటిల్ ను ప్రకటించడం మాత్రమే కాకుండా, టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ తో చిత్రం ఎలా ఉండబోతుంది అనే దాని పై ఒక క్లారిటీ వచ్చింది. టీజర్ లో విజువల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. స్టార్ హీరో సోదరుడు, యశ్ విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ చాలా బాగుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ను వచ్చే ఏడాది విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :