వైరల్ అవుతోన్న పునీత్ రాజ్ కుమార్ ఆఖరి ట్వీట్

Published on Oct 29, 2021 5:00 pm IST


కన్నడ సినీ పరిశ్రమ పునీత్ రాజ్ కుమార్ మరణం తో కన్నీటి సంద్రంలో మునిగింది. సినీ పరిశ్రమ లో పవర్ స్టార్ గా ఎదిగిన పునీత్ ఇండస్ట్రీ లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆఖరి సారి గా సోషల్ మీడియా వేదిక గా పునీత్ రాజ్ కుమార్ భజరంగి 2 చిత్రం పై ఒక పోస్ట్ చేయడం జరిగింది. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ చెబుతూ పోస్ట్ చేయడం జరిగింది. ఉదయం 7:33 గంటలకు పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

నటుడు గా మాత్రమే కాకుండా, సింగర్ గా, నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్న పునీత్ మరణం తో కన్నడ సినీ పరిశ్రమ మూగబోయింది. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ గుండెపోటు రావడం తో ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :

More