ప్రముఖ నటుడు పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత

Published on Oct 29, 2021 2:54 pm IST

కన్నడ పవర్ స్టార్, స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. నేడు ఉదయం జిమ్ చేస్తూ గుండెపోటు కి గురయ్యారు. చికిత్స నిమిత్తం బెంగళూరు లోని విక్రమ్ ఆసుపత్రి కి తరలించడం జరిగింది. వెనిలేటర్ పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

పునీత్ రాజ్ కుమార్ మరణం తో సినీ పరిశ్రమ లో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఆయన మృతి పట్ల ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ విషయం పట్ల తెలుగు సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదిక గా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఈయన మరణం కన్నడ మరియు భారతీయ సినీ పరిశ్రమ కి తీరని నష్టం అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More