ఆల్ టైం రికార్డ్ డే 1 వసూళ్లు సెట్ చేసిన పునీత్ “జేమ్స్”.!

Published on Mar 18, 2022 11:00 am IST

కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా “జేమ్స్”. దర్శకుడు చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకొని నిన్న కన్నడతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సంతరించుకుంది.

అయితే అభిమానులు ఎంతో ఎమోషనల్ గా తీసుకున్న ఈ చిత్రాన్ని కన్నడ ఇండస్ట్రీ లోనే రికార్డు ఓపెనర్ గా నిలబెట్టారు. గతంలో ఏ సినిమా కూడా అందుకోని విధంగా రికార్డు ఓపెనింగ్స్ వసూళ్ళని ఈ చిత్రం మొదటి రోజు అందుకున్నట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఆల్రెడీ బుకింగ్స్ లోనే దుమ్ము లేపిన జేమ్స్ ఫస్ట్ డే ఏకంగా 26.8 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి ముందు రికార్డులను భారీ మార్జిన్ తో దాటి ఆల్ టైం రికార్డు సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది పునీత్ కి ఒక గ్రేట్ ట్రిబ్యూట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రియా ఆనంద్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా పునీత్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆకట్టుకున్నారు.

‘జేమ్స్’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :