పవర్ ఫుల్ డైలాగ్స్ తో జేమ్స్ టీజర్… అద్దిరిపోయిందిగా!

Published on Feb 11, 2022 12:35 pm IST


దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ పునేత రాజ్ కుమార్ హీరోగా చేతన్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జేమ్స్. ఈ చిత్రం ను కిషోర్ ప్రొడక్షన్స్ పతాకంపై కిషోర్ పత్తికొండ నిర్మిస్తున్నారు. ఈ హీరో చిత్రం ను కేవలం కన్నడ లో మాత్రమే కాకుండా, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

నేడు తాజాగా అన్ని బాషల్లో టీజర్ ను విడుదల చేయడం జరిగింది. విడుదల అయిన కొద్ది సేపటికే టీజర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను సాధిస్తోంది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఉండటం మాత్రమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పునీత్ చెప్పే డైలాగ్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రాన్ని మార్చ్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :