డాక్టరేట్‌తో పునీత్ రాజ్‌కుమార్‌ ను సత్కరించిన మైసూర్ విశ్వవిద్యాలయం

Published on Mar 13, 2022 7:09 pm IST


హఠాత్తుగా మనల్ని విడిచిపెట్టిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మళ్లీ వార్తల్లో నిలిచారు. కన్నడ పరిశ్రమకు చెందిన పవర్ స్టార్‌ను మైసూర్ విశ్వవిద్యాలయం సత్కరించింది. వివరాల్లోకి వెళితే, సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి మరియు దాతృత్వ కార్యక్రమాలకు గాను దివంగత నటుడిని మరణానంతరం డాక్టరేట్‌తో సత్కరిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ హేమంత్ రావు ప్రకటించారు.

మార్చి 22న జరగనున్న యూనివర్శిటీ 102వ స్నాతకోత్సవం సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ఆయన తరపున అవార్డును అందుకోవడానికి అంగీకరించారు. మరోవైపు, పునీత్ చివరి చిత్రం, జేమ్స్, మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :