వైరల్ అవుతున్న పునీత్ మెమోరబుల్ వీడియో.!

Published on Oct 30, 2021 8:00 am IST

గత రెండేళ్ల కితం ప్రపంచానికి పట్టుకున్న పీడ కరోనా అనుకుంటే సరిగ్గా అది స్టార్ట్ అయ్యిన తర్వాత నుంచే ఇండియన్ సినిమా దగ్గర ఎందరో దిగ్గజాలు కూడా దూరం అవ్వడం మరింత కలచివేసే వార్తగా మారింది. నిన్ననే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా అసలు ఎవరూ ఊహించని విధంగా తన తుది శ్వాస విడవడం ప్రతీ ఒక్కరి గుండెని ముక్కలు చేసింది.

పునీత్ కోసం పెద్దగా తెలియని తెలుగు ఆడియెన్స్ నే అతడి మరణ వార్త విని ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. మరి అలాంటిది కన్నడ ప్రజల పరిస్థితి ఏంటి? అతడి అభిమానుల పరిస్థితి ఏంటి? దారుణం. అయితే తాను చనిపోయాక కూడా తన కళ్ళను దానం చేసి చిరస్థాయిగా నిలిచిన పునీత్ ది ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతీ ఒక్కరినీ మరింత భావోద్వేగానికి లోను చేస్తుంది.

తన సినిమా “యువరత్న” టైం లో అభిమానులను ఓ ఈవెంట్ లో వారికి తెలియకుండా వెళ్లి కలవడం వారితో ముచ్చటించడం వారి అవధులు లేని ఆనందానికి కారణమవ్వడం, అందులో తన నిజాయితీ ఈ వీడియోలో సారాంశం దీనితో ఈ వీడియో చూసిన వారు అంతా పునీత్ అకాల మరణం పట్ల మరింత భావోద్వేగానికి లోను చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ పునీత్ లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి, అపారమైన టాలెంట్ కలిగిన హీరో ఇండియన్ సినిమా దగ్గర లేని లోటు ఎవరూ తీర్చ లేనిది.

సంబంధిత సమాచారం :

More