పునీత్ నేత్ర దానం…వైరల్ అవుతోన్న ఫోటో!

Published on Oct 29, 2021 7:34 pm IST


పునీత్ రాజ్ కుమార్ కన్నడ లో స్టార్ హీరో గా ఎదిగారు. పవర్ స్టార్, అప్పు అంటూ ఫ్యాన్స్ పిలుస్తూ ఉంటారు. పునీత్ చాలా మందికి జీవితాన్ని అందించారు. విద్యార్థులకు, పేద ప్రజలకు ఎంతో సహాయం చేశాడు. తను కళ్ళను దానం చేస్తాను అని గతం లో మాటిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

నేడు అతని మరణం తో కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. పునీత్ రాజ్ కుమార్ కళ్ళను దానం చేయడం జరిగింది. ఆ కళ్ళు అవసరమైన వారికి దానం చేయనున్నారు. అయితే అందుకు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అతను కళ్ళను తీసిన అనంతరం తీసిన ఫోటో వైరల్ గా మారుతోంది. తన తండ్రి సూపర్ స్టార్ రాజ్ కుమార్ లాగానే పునీత్ కూడా తన కళ్ళను దానం చేస్తా అని ప్రతిజ్ఞ చేశారు. కన్నడ దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ ఇలా చేయడం గొప్ప మనసుకు సంకేతం.

సంబంధిత సమాచారం :

More