కరోనా విషయంలో ‘ సుమ’ గురించి ‘ పురాణపండ శ్రీనివాస్ ‘ అదరగొట్టేసారు

Published on Mar 26, 2020 5:02 pm IST

అంతర్జాతీయంగా కరోనా కల్లోలంలో బెంబేలెత్తుతున్న వేళలో… ఈ ఆపత్కాల పరిస్థితిలో ధైర్యంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుగు సినీ ప్రముఖులు, రాజకియ ప్రముఖులు ఒక ప్రక్క చెబుతుండగా ….. మరోపక్క ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్’ కరోనా వైరస్ ‘ గురించి యు ట్యూబ్ లో చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మనిషి కండకావరం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని పురాణపండ శ్రీనివాస్ చెప్పిన అద్భుత ప్రసంగాన్ని నెటిజన్లు ‘ సూపర్’ గా ప్రసంసిస్తున్నారు . ఈ స్పీచ్ లో ప్రముఖ యాంకర్ ‘ సుమ ‘ వ్యాఖ్యల్ని కూడా పురాణపండ శ్రీనివాస్ అద్భుతంగా సమర్ధించడాన్ని సుమ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి , జూనియర్ ఎన్.టి.ఆర్ , రామ్ చరణ్ , మహేష్ బాబు,నాగార్జున, వెంకటేష్ … ఇలా చాలామంది సినీ ప్రముఖులు చేసిన , చెప్పిన జాగ్రత్తలు మనం చూసినా పురాణపండ శ్రీనివాస్ చెప్పిన వీడియో చాలా ఆసక్తిగా ఉండటం విశేషం. తెలుగునాట మంచి వక్తగా, మహోన్నత గ్రంధాల రచనా సంకలనకర్తగా విశేష ఖ్యాతి సంపాదించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఈ సామాజిక విపత్తు సందర్భంలో స్పందించడాన్ని ప్రభుత్వాధికారులు సైతం అభినందిస్తున్నారు. ‘సూపర్ టాలెంటెడ్’ సుమకి చాలాకాలంగా మంచి స్నేహితులైన ‘స్పాంటేనియస్ స్పీకర్’ పురాణపండ శ్రీనివాస్ ఈ విషయంలో’ సుమ’ ను హ్యాపీగా సమర్ధించడం విశేషం.

ఏది ఏమైనా కోవిడ్ ని కట్టడిలో చేయడమే లక్ష్యంగా సాగుతున్న పోరాటంలో ఒక రచయితగా శ్రీనివాస్ అత్యద్భుతంగా చెప్పిన విషయాన్ని యూట్యూబ్ లో ఒకసారి చూస్తే కొందరు మనుషుల్లో కనీసం మానవీయత పెరుగుతుందని మేధో సమాజం పేర్కొంటోంది.

సంబంధిత సమాచారం :

X
More