తిరుమలలో పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేక ‘గోపూజ’

Published on Sep 21, 2021 5:05 pm IST

తిరుమల : సెప్టెంబర్ ; 21

శేషాచల పర్వతంపై కొలువుతీరి కోట్లాది భక్తులను అనుగ్రహిస్తున్న వేంకటేశ్వరస్వామివారంటే ఈ సృష్టికే జీవచైతన్యమని అనేక సభలలో ప్రాణప్రదంగా చాలా అందమైన భాషలో ఆవిష్కరించే ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన మాసపత్రిక పూర్వసంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ఈ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.

ఇదే సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా , ప్రముఖ సినీ నటి సమంత కూడా స్వామి వారిని ప్రత్యేకంగా వేరు వేరు సమయాలలో దర్శించుకున్నారు.

అనంతరం శ్రీనివాస్ తిరుమల ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులుతో ప్రత్యేకంగా సమావేశమై అనేక వైదిక , వైఖానస అంశాల్ని చర్చించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

తిరుమల వేదం విశ్వవిద్యాలయంలో , తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో , తిరుమల తిరుపతి దేవస్థానములలోని అనేక విభాగాలలో పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలకు వందల సంఖ్యలో ఫాలోవర్స్ వున్నారు.

తిరుమల మహాక్షేత్ర గత ప్రధాన అర్చకులు , ఇప్పటి ప్రత్యేక ఆగమ సలహాదారులు ఏ.వి . రమణ దీక్షితులు తో కూడా శ్రీనివాస్ కి మర్యాదాపూర్వకమైన ఆత్మీయ సంబంధాలున్నాయనేది తిరుమల ఉద్యోగులందరికీ ఎరుకే.

ఇదిలా ఉండగా .. శ్రీవారిని దర్శించుకుని వఛ్చిన పురాణపండ శ్రీనివాస్ ను మీడియా ప్రతినిధులు చుట్టుముడుతుండగా శ్రీనివాస్ ఇది సందర్భంకాదని , వెనక్కి వెళ్ళమని చేత్తో సైగ చేసి మీడియా వారిని సున్నితంగా తిరస్కరించారు.

అనంతరం శ్రీనివాస్ తిరుమల గోశాలలో గోమాతకు ప్రత్యేక పవిత్ర పూజ నిర్వహించడం విశేషం.

సంబంధిత సమాచారం :