వేల భక్తుల గుండెల్లో ఎగురుతున్న జెండా పురాణపండ ‘ శ్రీపూర్ణిమ’ కి జయహో !

Sri-Purnima-Book-Written-by-Puranapanda-Srinivas

తిరుమల: డిసెంబర్: 2

ఆచార్యుని అనుశాసనంలాంటి అపూర్వ గ్రంధాలను అందిస్తూ, అద్భుతాలను సృజియిస్తూ, అఖండ జెండాగా ఎగురుతూ, భక్త పాఠకులపై ఆనందరస వర్షాన్ని కురిపిస్తున్న మనోహర రచనల రచయిత, సర్వాంతర్యామిత్వాల సంకలనకర్త పురాణపండ శ్రీనివాస్ లోకకళ్యాణకారకంగా అందించిన ‘ శ్రీపూర్ణిమ’ గ్రంధం శరవేగంగా మంగళకార్యాల వేడుకల్లో దూసుకు పోతోంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, అశ్వనిదత్, దిల్ రాజు, రోజా, ఆనం రాంనారాయణ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తుమ్మల నాగేశ్వర రావు, సోము వీర్రాజు, తీగల కృష్ణారెడ్డి వంటి ప్రముఖుల సమర్పణలో వేల వేల ప్రతులు ఆంధ్ర , తెలంగాణ ప్రాంతాల ఆలయాల్లో, వేదం పాత శాలల్లో, వేడుకల్లో, పర్వదినాల్లో, సాహిత్య చర్చాగోష్టుల్లో, సాంస్కృతిక ఉత్సవాలలో ఎంత ఆకట్టుకుని పవిత్ర సంచలనం సృష్టించాయో మేధో సమాజం ప్రశంసలు వర్షిస్తూనే వుంది.

ఒక భౌతిక సాధనంతో కొలవలేని అప్రమేయ అంశాలెన్నో ఈ ‘ శ్రీపూర్ణిమ’ లో చోటు చేసుకోవడం వల్లనే , ధర్మభావన వాళ్ళ ప్రేరేపితమైన పారమార్ధిక శక్తులుండటం వల్లనే, వేంకటాచల క్షేత్ర అతీంద్రియ మహనీయతల్ని అద్భుతంగా వర్ణించడం వల్లనే, సమస్త బ్రహ్మాన్దం లోని ప్రతి అణువూ నారసింహుని విరాట్రూపంలోని అభిన్నరూపమని చక్కని కథతో నిరూపించడం వల్లనే తేజస్వుల వర్చస్సుగా ఈ బుక్ సంచలనమై విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం స్తోత్ర భాగాలే కాకుండా పురాణపండ శ్రీనివాస్ మధ్యలో ఇఛ్చిన స్క్రిప్ట్ సూపర్బ్. ముఖపత్రంపై తిరుచానూరు అలమేలుమంగమ్మ దివ్యతేజస్సుల శోభతో ఈ పుస్తకం నిస్సందేహంగా ఒక అఖండ ప్రకాశంగా భక్త పాఠకులకు షోడశకళాప్రపూర్ణంగా అందిందనేది సత్యం. సుబ్రహ్మణ్య షష్ఠినాడు ఈ బుక్స్ అందుకున్న వారి
సంతోషం మాటల్లో వర్ణించలేకపోతున్నాం.

తిరుమల, హైదరాబాద్ నగరాలలో జరిగిన పవిత్ర వేడుకల్లో ఈ గ్రంధరాజ శాంతి కాంతి దీప్తుల ప్రసన్న చిత్రాలను భక్తుల సమేతంగా ఇక్కడ అందించాం. సహస్రకిరణుడైన అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎంతో భక్తి ప్రతిష్టతో చేసుకున్న శ్రీ కే. రాజశేఖర్ , శ్రీమతి కే. వసుంధర దంపతులు సత్యదేవుని అనుగ్రహంతో ఎంతోమంది విజ్ఞులకు ఈ జ్యోతిర్మయ మహామంత్రపేటికను బహూకరించడం పవిత్ర విశేషంగానే చెప్పాలి. వారి శ్రద్ధాభక్తులకు ఈ పుస్తకం తలమానికం. ప్రార్థనకు చక్కని మార్గదర్శనం చేసే పరమ గురువులాంటి బుక్ ని ఒక సమృద్ధి మంత్ర బాండాగారంలా అందించిన పురాణపండ శ్రీనివాసులో వున్న పరమాత్మ మరిన్ని కైవల్యదర్శనాల్లాంటి మాంచి మాంచి బుక్స్ ని పురాణపండ చేత అందింప చెయ్యాలని మనం కోరుకోవాలి. ఆయన శ్రమ, నిస్వార్థసేవ, అద్భుత రచనా సొగసులశైలిని అభినందించి తీరాల్సిందే. ఇంత ధైర్యంగా ఎవ్వరూ ఈరోజుల్లో ఇంత ఉత్తమమైన గ్రంథ సేవ చెయ్యలేరు. చెయ్యరు కూడా. అతనికి భగవంతునిపై వున్న నమ్మకం అలాంటిది మరి.

బాహ్య ఆవరణాలనుండి మనల్ని భగవంతుని వైపు నడిపించిన శ్రీపూర్ణిమ పుస్తకాన్ని అందుకున్న వారెంత ధన్యులో. మహా మహా తలలు తిరిగిన, నోరుతిరిగిన వేద పండితులు, పీఠాధిపతులు సైతం శ్రీనివాస్ కృషిని అభినందించి ఆశీర్బలాలు అందించడం ఒక మంచి మంగళ పరిణామం. తిరుచానూరు అమ్మ కార్తీక బ్రహ్మోత్సవంలో కూడా అక్కడి సమీపం ఆలయాల్లో ఈ గ్రంధం చేసిన సందడికి వేల భక్తులే సాక్షి. అంతా తిరుమల శ్రీవారి దయ అంటారు వినయ విధేయతలతో శ్రీనివాస్. అంతకంటే ఇంకేంకావాలి.

Puranapanda Srinivas

Exit mobile version