“కళా” అందించిన పురాణపండ శ్రీనివాస్ ” శ్రీమాలిక ” భళా – ప్రముఖ నిర్మాత కూచిభొట్ల వివేక్ కు అభినందనలు

Puranapanda Srinivas

సికింద్రాబాద్ : అక్టోబర్ : 15

భారత దేశంలో సనాతన ధర్మపరిరక్షణకు ఒక పవిత్ర దిక్సూచి .. శృంగేరీ పీఠం. సకల నిగమాగమసారహృదయులైన శృంగేరీ పీఠాధీశ్వరుల అనుగ్రహంతో ఈ సంవత్సరం శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయంలో అద్భుతంగా సాగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలలో వేలకొలది భక్తుల్ని ఒక సనాతన ధర్మ గ్రంధం విశేషంగా ఆకర్షించింది.

ఒక పవిత్ర సజీవానుభావాన్నిచ్చే అద్భుత గ్రంథ రచనలతో, సంకలనాలతో తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతున్న ప్రముఖ రచయిత , జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలన గ్రంధం ‘ శ్రీమాలిక ” మంత్రమాలికే ఈసారి ఆకర్షణ. దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం పర్యవేక్షణలో అద్భుత మంత్ర శక్తితో నడుస్తున్న ఈ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయానికి విచ్చేసిన వేలకొలది భక్తులకు ఈ ఆలయ ధర్మాధికారి కళా జనార్ధనమూర్తి ఈ రెండువందల యాభై పేజీల ఈ మహోన్నత గ్రంధాన్ని సద్భక్తితో అందించడంతో భక్తుల సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి.

గోదావరి జిల్లాలు కేంద్రంగా అంతర్జాతీయ తెలుగు భక్త సమాజానికి అద్భుత మంత్రమయ మహాగ్రంధాలతో , అత్యద్భుత రచనలతో , అపురూప ప్రసంగాలతో చిరపరిచితులైన పురాణపండ శ్రీనివాస్ ఏ గ్రంధానికి పూనుకున్నా అది అమోఘ కార్యంగా లక్షలాది ప్రజలకు క్షేమం కలిగించుతోందని పండిత పామరురులంతా చాలా కాలంగా గొంతెత్తి చెబుతూనే ఉండటం గమనార్హం. ఈ మహాగ్రంధాల సమర్ధకార్యాన్ని తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ ఒక్కరే చేయగలరని తిరుమల , ఇంద్రకీలాద్రి, శ్రీశైలం కొండగట్టు, యాదాద్రి, వేములవాడ, జోగులాంబ దేవస్థానాల పండితులతో పాటు కళా జనార్ధన మూర్తి కూడా స్పష్టంగా చెప్పేసారు.

ఎంతటి మహాగ్రంధాన్నైనా సరే కేవలం రోజుల్లోనే కార్యరూపం దాల్పించి , పవిత్రంగా … నిస్వార్ధంగా అందించడమనేది పురాణపండ శ్రీనివాస్ వల్లనే సాధ్యమౌతోందని, , ఇది మామూలు విషయం కాదని , పురాణపండ శ్రీనివాస్ పై జ్ఞాన సరస్వతీదేవి విశేష అనుగ్రహం వర్షించడం వల్లనే సాధ్యమౌతోందని కళా జనార్ధన మూర్తి చెప్పడం విశేషం. అందువల్లనే … ఎన్నో అఖండ గ్రంధాలతో లక్షలకొలది భక్త పాఠకుల్ని ఆకర్శించి నిస్వార్ధ సేవలో తెలుగు రాష్ట్రాలలో అగ్రస్థానంలో వున్నారు పురాణపండ శ్రీనివాస్ . శ్రీనివాస్ రచనా వ్యాఖ్యానాల్లో వుండే అందమైన ధ్వనికి, నిగూఢ కోణాలకి వేలకొలది అభిమానులున్నారనేది నిర్వివాదాంశం.

పరమ శోభాయమానంగా వున్నా ఈ శ్రీమాలిక గ్రంధాన్ని దేవీ నవరాత్రుల ఉత్సవాల అంకురార్పణ సందర్భంగా ప్రత్యేక అతిధిగా పాల్గొన్న పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి ఆవిష్కరించి , ఈ గ్రంథ లావణ్యాన్ని, పురాణపండ శ్రీనివాస్ పవిత్ర ప్రతిభను ప్రశంసించారు. ఇన్ని వందల గ్రంధాలను సహృదయంతో పంచుతున్న కళా జనార్ధన మూర్తి సహృదయానికి మంగళా శాసనం చేశారు. ఈ ఆలయంలో వైభవోపేతంగా జరిగిన శ్రీ దేవీనవరాత్రుల ఉత్సవాలకు హాజరైన కేంద్ర హోమ్ శాఖామంత్రి మంత్రి కిషన్ రెడ్డి, , తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కే. వి. రమణాచారి, భారత మాజీ ప్రధాని పీ.వి. నరసింహారావు కుమార్తె అయిన ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి , జస్టిస్ రామలింగేశ్వర రావు , తెలంగాణ బెవెరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ , మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వంశీ ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ వంశీ రామరాజు తదితర ప్రముఖులకు కళా జనార్ధన మూర్తి అమ్మవారి ప్రసాదంగా ఈ మంగళ గ్రంధాన్ని బహూకరించడం విశేషం.

ఇక్కడ మాత్రమే కాకుండా … పురాణపండ శ్రీనివాస్ శ్రీమాలిక పుస్తకాలు మరికొన్ని చోట్ల కూడా ఈ దసరా సందర్భంలోనే తెలుగు వారిని వుర్రూతలూగించడం కన్నుల ముందు కనిపిస్తున్న సత్యం. నిజానికి నిఖార్సుగా చెప్పాల్సిన ముఖ్యాంశం ఏమంటే పురాణపండ శ్రీనివాస్ బుక్స్ ఏనాడూ అస్సలు వ్యాపార కాలుష్యాన్ని పులుముకోక పోవడంవల్లనే లక్షలాది పాఠకుల పూజాపీఠాల్లో పవిత్రంగా, పరమ శోభాయమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. మహా నాగరికతలు, సాంకేతిక అంశాలు పెరిగి నానాటికీ జీవితంలో అధిక భాగం మొబైల్ ఫోన్ లో యు ట్యూబ్ కో , పేస్ బుక్ కో అంకితమైన ఈ కాలంలో …. పుస్తకాలు చదవడం తక్కువైన ఈ కాలంలో కూడా ఒకే ఒక వ్యక్తి అప్రతిహత శక్తికి ఆవిష్కృతమవుతున్న అద్భుత గ్రంధాలకు తెలుగు రాష్ట్రాలలో అనూహ్య ఆదరణ లభిస్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తోందని తెలుగు రాష్ట్రాలలో మేధావుల నుండి సామాన్యుల వరకూ ఎందరో చెబుతున్నారు.

ఒక్కొక్క బుక్కు ఒక్కొక్క విలక్షణ పేరుతో అత్యంత సౌందర్యంగా దర్శింప చేసే పురాణపండ శ్రీనివాస్ నిస్వార్థసేవను నేను ఎక్కడా చూడలేదని , ముద్రణా సౌందర్యం భాషాసౌందర్యం, పుస్తక సౌందర్యం అదిరిపోతోందని భాషావేత్తలు నుంచి భక్త పాఠకుల వరకూ ఈ పవిత్ర గ్రంధాలకు నీరాజనాలిస్తున్నారని జనార్ధనమూర్తి భక్త జనులెందరికో చెప్పడం గమనార్హం. మరొక ప్రక్క ప్రముఖ సినీ నిర్మాత కూచిభొట్ల వివేక్ సైతం బంజారాహిల్స్, జూబిలీ హిల్స్, గచ్చీబౌలి , శ్రీనగర్ కాలనీ ల లోనే పలు ఆలయాల పండితులకు, అర్చకులకు ఈ సంప్రదాయ గ్రంధాన్ని అందించడంతో వారు పొందిన సంతోషం అంతా ఇంతా కాదనే చెప్పాలి. కూచిభట్ల వివేక్ పక్షాన ఈ చక్కని గ్రంధాలు ఎంతో సహృదయంతో పంచిన ఆకెళ్ళ ప్రసాద్ ని అందరూ అభినందించారు.

ఇంకొక ప్రక్క ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘ కిన్నెర ఆర్ట్ థియేటర్స్’ రవీంద్ర భారతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ ఎస్ .పీ. బాలసుబ్రహ్మణ్యానికి ఘనస్వర నీరాజనం ‘ కార్యక్రమంలో పాల్గొన్న నలభైమంది గాయనీ గాయకులకు జ్ఞాపికలుగా ఈ గ్రంధాన్ని అందించడం మరొక ప్రత్యేకం. అంతే కాదు గోదావరీ తీరంలోని రాజమహేంద్రవరం నగరంలో గంగరాజు మిల్క్ డైరీ చైర్మన్ నిమ్మలపూడి గోవింద్ సమర్పణలో ఈ శ్రీమాలిక గ్రంధాన్ని గాయత్రీ ఉపాసకులైన గాయత్రీ పీఠం వ్యవస్థాపకులు సవితాల చక్ర భాస్కర్ ఆవిష్కరించి , తొలి ప్రతిని స్టాండర్డ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ చెన్నాప్రగడ శ్రీనివాస్ కి అందించారు. పవిత్ర స్థలి అయిన ఈ గాయత్రీ దేవాలయానికి విచ్చేసిన భక్తులకు ఈ తొమ్మిది రోజులూ ఈ మంత్ర సంపదను నిమ్మలపూడి గోవింద్ సహకారంతో చక్రభాస్కర్ సంప్రదాయవిలువల మద్య అందించడంతో భక్త బృందాలు పులకించాయనే చెప్పాలి. శ్రీ చక్ర భాస్కర్ కి, శ్రీ నిమ్మలపూడి గోవింద్ కి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. మహా గ్రంధాలతో సుదర్శన చక్రాల్లా దూసుకు పోతున్న పురాణపండ శ్రీనివాస్ ఎప్పటిలానే శ్రీనివాస్ ఈ కార్యక్రమాలకు దూరంగా వున్నారు.

Exit mobile version