‘ఆటోజానీ’ కోసం బ్యాంకాక్‌లో పూరీ బిజీబిజీ!

puri-jagannath

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. చిరు కోసం పూరీ జగన్నాథ్ ఓ పవర్ఫుల్ స్టోరీని ఓకే చేశారు. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. బీవీఎస్ రవి ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉండడంతో పాటు సినిమాను అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ కూడా చిరు కెరీర్లో మరచిపోలేని సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

తాజాగా ఈ సినిమా డైలాగ్ వర్షన్ రాయడం కోసం పూరీ జగన్నాథ్ తనకు ఎంతో ఇష్టమైన బ్యాంకాక్ వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ చిరు ఇమేజ్‌కు సరిపడేట్టుగా పవర్ఫుల్ డైలాగులను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరు 150వ సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను ప్లాన్ చేస్తున్నారు పూరీ. ఆగష్టు 22న లాంచ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version