మెగాస్టార్ కోసం ‘పూరి’ పవర్ ఫుల్ కథ !

మెగాస్టార్ కోసం ‘పూరి’ పవర్ ఫుల్ కథ !

Published on Nov 21, 2022 7:01 AM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్‌ సినిమా పెట్టుబడుల పై విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, మరోపక్క పూరి, మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తున్నాడట. పూరి తన టీమ్ తో ప్రస్తుతం మెగాస్టార్ స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారు. పూరితో మళ్ళీ ఓ సినిమా చేస్తానని మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ మధ్య ఇచ్చిన లైవ్ చాట్ లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. అన్నట్టు పూరి, మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ ఎమోషనల్ యాక్షన్ స్టోరీ రాస్తున్నాడట. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో ఇండియట్ కి కొనసాగింపుగా ఉంటుందని టాక్ నడుస్తోంది. అయితే తండ్రి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కథ సాగుతుందట. ఈ సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా యాక్షన్ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు