మెగా అభిమానులు ఈ ఏడాది ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం..మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ సినిమానే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఏడాది మొదలు కానుందని తెలియగానే వారి ఆనందానికి అవధుల్లేవు. అంతే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు 150వ సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయనున్నాడని తెలియడంతో ఈ సినిమా వార్తల్లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనౌన్స్ చేసిన కొద్ది రోజుల పాటు మీడియాలో హాట్ టాపిక్ గా హల్ చల్ చేయడమే కాకుండా చిరు బర్త్ డే కానుకగా ఈ సినిమాని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆగిపోయింది దానికి కారణం పూరి చెప్పిన కథ తనని పూర్తిగా మెప్పించలేకపోయిందని చిరు తెలిపారు.
తాజాగా జరిగిన విలేఖరుల సమావేశంలో పూరి జగన్నాధ్ ని చిరు 150వ సినిమా గురించి ప్రశ్నిస్తే ఆయన సమాధానం ఇస్తూ ‘ చిరంజీవికి కథ చెప్పాను. ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది, సెకండ్ పార్ట్ చెప్పాక తర్వాత చెప్తాను అని పంపించేసారు. కానీ ఆ తర్వాత నాకు ఏమీ చెప్పలేదు. కానీ డైరెక్ట్ గా మీడియా ముందు మాత్రమే సెకండాఫ్ నన్నంత మెప్పించలేకపోయిందని చెప్పారు. యన నాకు చెప్పుంటే మార్పులు చేచేయమన్నా చేసేవాన్ని కానీ ఎందుకో చెప్పలేదు. నీను మాత్రం ఆయన ఇప్పుడు పిలిచి సినిమా చేయమన్నా చేయడానికి సిద్దంగా ఉన్నానని’ పూరి జగన్నాథ్ తెలిపాడు. మరి ఈ విషయంపై మెగాఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
