మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ రెడీ అట

మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ రెడీ అట

Published on Dec 19, 2022 11:07 PM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మెగాస్టార్ కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తున్నాడని.. ఈ క్రమంలో నే పూరి గతంలో తన టీమ్ తో కలిసి గోవాలో క్యాంప్ వేసుకుని మరీ స్క్రిప్ట్ పై కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కథ పూర్తి అయిందట. త్వరలోనే మెగాస్టార్ కి ఈ కథను పూరి వినిపించబోతున్నాడు. పూరి కథలో మంచి డెప్త్ ఉందని తెలుస్తోంది. పైగా ఈ కథా నేపథ్యం కూడా చాలా కొత్తగా ఉంటుందట.

పైగా తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో మంచి ఎమోషన్ కూడా ఉంటుందట. కాగా సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా యాక్షన్ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని తెలుస్తోంది. లైగర్ ప్లాప్ తర్వాత.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి పూరి ఈ కథ పై బాగా వర్క్ చేశాడు. కాబట్టి, ఈ సారి మెగాస్టార్ – పూరి కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. పూరితో ఓ సినిమా చేస్తానని మెగాస్టార్ కూడా ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు