మెగాస్టార్ కోసం పూరి జగన్నాధ్ ‘ఆటో జానీ’..

chiru-puri
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే ప్రతి మెగా అభిమాని ఆయన్ను తెరపై ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపిస్తాను. నేను కూడా చిరంజీవికి వీరాభిమానిని. అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ‘టెంపర్’ సక్సెస్ తర్వాత చిరు 150వ సినిమాకు దర్శకుడిగా పూరి జగన్నాధ్ అయితే బెటర్ అని రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ.. చిరు కోసం ‘ఆటో జాని’ టైటిల్ రిజిస్టర్ చేయించాను. ఇంకా స్టొరీ, స్క్రిప్ట్ రెడీ కాలేదు. ఈ టైటిల్ విన్న తర్వాత కథేంటి అని ఎవరు అడగరు. చిరంజీవి గారి ఫోన్ కోసం వెయిటింగ్. అని అన్నారు.

‘బుడ్డా హోగా తేరా బాప్’ ప్రీమియర్ సందర్భంగా చిరంజీవికి 150వ సినిమాకు దర్శకుడిగా పూరి పేరును అమితాబ్ రికమండ్ చేశారట. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తే అతిధి పాత్రలో నటిస్తానని మాట కూడా ఇచ్చారట.

Exit mobile version