కుమారుడి కోసం కొత్త హీరోయిన్ ను తీసుకొస్తున్న పూరి !
Published on Sep 24, 2017 10:23 am IST


కొత్త కొత్త హీరోయిన్లను పరిశ్రమకు పరిచయం చేయడంలో పూరి జగన్నాథ్ డి అందెవేసిన చేయి. ఇప్పటికే తన సినిమాలతో అనేక మంది హీరోయిన్లను తెలుగులోకి తీసుకొచ్చారాయన. ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్ పూరిని రీ లాంచ్ చేస్తూ ఆయన చేయనున్న చిత్రంలో కూడా కొత్త హీరోయిన్ ను సెలెక్ట్ చేశారు పూరి. ఆమే నేహా శెట్టి.

కన్నడ చిత్రం ‘ముంగారు మేల్ 2’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టిని సుమారు 200 మంది మ్మాయిల్ని ఆడిషన్స్ చేసిన తర్వాత ఫైనల్ చేశారట పూరి. ఆ తర్వాత చేసిన ఫోటోషూట్, ట్రైల్ షూట్ తో కూడా జగన్నాథ్ ఇంప్రెస్ అయ్యారట. ప్రస్తుతం ఈమె త్వరలో ప్రారంభంకానున్న ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

 
Like us on Facebook