ఆ చావులు చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయన్న పూరి జగన్నాథ్ !
Published on Dec 21, 2016 8:41 am IST

puri
డాషింగ్ డైరెక్టర్ పూరి జాగన్నాధ్ కు పరిశ్రమలో వర్మ శిష్యుడు అనే మరో పేరుంది. పూరి తన సినీ జీవితం వర్మ చలవే అని చాలా సార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. తాజాగా వర్మ నిర్వహించిన ‘ఆర్జీవీ టు వంగవీటి’ వేడుకలలో కూడా అదే చెప్పాడు. నిన్న రాత్రి జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు హాజరైన పూరి వేదికపై మాట్లాడుతూ ‘ఒక్కడొచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆయనే రామ్ గోపాల్ వర్మ. ఆయన దగ్గరే మేమంతా పనిచేశాం. మా జీవితాలన్నీ శివ సినిమాతోనే మొదలయ్యాయి, అందరం డైరెక్టర్లయ్యాము. ఆయనతో నా పాతికేళ్ల జర్నీలో ఆయనపై ప్రేమ పెరుగుతూనే వచ్చింది’ అంటూ తన గురువుని ఉద్దేశించి మాట్లాడారు.

అలాగే ‘వంగవీటి సినిమా ఒక 40 నిముషాల పాటు చూశాను, అద్భుతమైన సినిమా. సినిమాలో రాధాగారి మరణం, మురళీగారి మరణం చూశాను. చాలా భాధ అనిపించింది. కళ్ళలో నీళ్ళొచ్చాయి. విజయవాడ ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ సినిమాలో రాధా, రంగ పాత్రలు చేసిన నటుడు శాండీ అదృష్టవంతుడు, వంశీ, శ్రీ తేజ అందరూ తప్పకుండా పెద్ద స్టార్లు అవుతారు’ అని అన్నారు. ఏ వేడుకకు వెంకటేష్, నాగార్జున, రాజమౌళి, బోయపాటి శ్రీను, రాజశేఖర్, హరీష్ శంకర్, వైవిఎస్ చౌదరి లు హాజరయ్యారు. ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook