లైగర్ కంటే ముందే “జన గణ మన”ను ఎలా పూర్తి చేస్తాడో ?

Published on Feb 7, 2022 11:38 am IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ప్రస్తుతం ‘లైగర్’ సినిమా వస్తోంది. 2020 జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మధ్యలో కరోనా రావడంతో “లైగర్” సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. మొత్తమ్మీద పూరి ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ తన డేట్స్ ను కేటాయించలేదు. ఎట్టకేలకు ‘లైగర్’ 2022 ఆగస్టులో విడుదల కానుంది

అయితే, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ మరో సినిమా చేయబోతున్నాడని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. లైగర్ సినిమా అవుట్ ఫుట్ విజయ్ కి చాలా బాగా నచ్చిందని, అందుకే, లైగర్ తర్వాత కూడా పూరితోనే మరో సినిమా చెయ్యాలని విజయ్ దేవరకొండ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

అయితే పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రం జన గణ మన అని అధికారికంగా ప్రకటించాడు. మొత్తానికి లైగర్ విడుదలకు ముందే కొత్త సినిమా సంగతులు చెప్పాడు పూరి. పైగా లైగర్ విడుదలకు ముందే ఈ కొత్త సినిమా షూటింగ్ పూర్తవుతుందని కూడా తెలుస్తోంది. మరి లైగర్ కంటే ముందే “జన గణ మన”ను పూరి ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :