పూరి ఫుల్ బిజీ!

1st, March 2017 - 09:24:40 AM


దర్శకుడు పూరి జగన్నాథ్ ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ మధ్యే నందమూరి బాలకృష్ణతో సినిమాను అనౌన్స్ చేసిన ఆయన మార్చి 9న సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నారు. అందుకోసం ఇప్పటి నుండే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మరోవైపు ఈ స్టార్ దర్శకుడు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో సైతం సినిమాను మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలవుతుందని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇలా ఒకేసారి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేస్తున్న పూరి కొత్త హీరో ఇషాన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిని కూడా భుజాలకెత్తుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తైన ఈ చిత్రం యొక్క అఫీషియల్ టీజర్ లాంచ్ ఈరోజు సాయంత్రం జరగనుంది. ఈ వేడుకలో ద్వారా ఇషాన్ ను పూరి స్వయంగా ఇంట్రడ్యూస్ చేయనున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం పట్ల రెండు పరిశ్రమల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇలా ఒకేసారి మూడు సినిమాలకు పనిచేస్తున్న పూరి ఇంకొన్ని నెలల పాటు ఇలాగే బిజీబిజీగా గడపనున్నారు.