పూరి హీరో కొత్త సినిమా మొదలు !

2014లో తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించిన సతురంగా వెట్టయ్ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. రోమియో మూవీకి దర్శకత్వం వహించిన గోపి గణేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. శ్రీదేవి మూవీస్ ఫతకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభం అయ్యింది. జ్యోతి లక్ష్మి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య దేవ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

తమిళంలో మాదిరి తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. సత్యదేవ్ హీరోగా నటించిన తాజా సినిమాలు 47డేస్, గువ్వా గోరింక సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలతో సత్యదేవ్ నటుడిగా మరోమెట్టు ఎక్కాలని ఆశిద్దాం.