పూరి స్క్రిప్ట్ ఎవరి కోసం ?

puri
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజా చిత్రం ‘ఇజం’ విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పూరి కళ్యాణ్ రామ్ కు మంచి బ్రేక్ ఇచ్చి నటుడిగా అతన్ని ఇంకో మెట్టు పైకెక్కించాడు. సినిమా సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకొని పూరి ఇప్పుడు వెంటనే మరో సినిమాకి రెడీ అయిపోతున్నాడు. ప్రస్తుతం పూరి నెక్స్ట్ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ బ్యాంకాక్ లో జరుగుతోంది.

కానీ ఈ స్క్రిప్ట్ ఎవరి కోసం అనేది ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే పూరి గతంలో తన తరువాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించి ‘జనగణమన’ పేరుతో టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. మరో వైపు ఈ మధ్య పూరి తారక్ కు స్టోరీ లైన్ చెప్పాడని, తారక్ కూడా లైన్ నచ్చడంతో జగన్ ను పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చెయ్యమన్నాడని, ప్రస్తుతం పూరి అదే పనిలో ఉన్నాడని వార్తలొచ్చాయి. కనుక ఇప్పుడు బ్యాంకాక్ లో పూరి రెడీ చేస్తున్న స్క్రిప్ట్ మహేష్ కోసమా లేకపోతే తారక్ కోసమా అన్నది తెలియాల్సి ఉంది.