చిరు “గాడ్‌ఫాదర్”లో పూరి జగన్నాధ్ అతిధి రోల్..!

Published on Apr 9, 2022 12:20 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం లూసిఫర్‌కి ఇది రీమేక్. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ జరుపుకుంది. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రకిగాను తెలుగు రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇందులో ఆయన జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడని, ఆ పాత్ర నిడివి కొద్దిసేపే అయినప్పటికీ పవర్ ఫుల్‌‌‌‌గా ఉండబోతుందని తెలుస్తుంది. చిరంజీవితో సినిమా చేయాలని పూరీ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. చిరు రీఎంట్రీకి కూడా కథని వినిపించాడు. వివిధ కారణాల వల్ల ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు కానీ ఇప్పుడు చిరు సినిమాలో పూరి స్క్రీన్ చేసుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :