డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన పూరి జగన్నాథ్ !
Published on Jul 16, 2017 11:34 am IST


గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు పోలీసుల నుండి నోటీసులు అందుకోగా త్వరలో ఇంకొందరి పేర్లు బయటికొస్తాతాయనే ప్రచారం సాగుతోంది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు.

ఈ నైపథ్యంలో పూరి ఈ డ్రాగ్ మాఫియాతో సంబంధం ఉన్న కొందరు పరిశ్రమలోని పెద్దవాళ్ల జోలికి మాత్రం పోలీసులు వెళ్లడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. దీనిపై స్పందించిన పూరి తానూ ఈ విషయంపై ఎవ్వరికీ ఎలాంటి వివరణ ఇవ్వలేదని, ప్రస్తుతం తాను ‘పైసా వసూల్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook