దర్శకుడిగా గత కొన్ని సినిమాల నుండి సరైన విజయం అందుకొని పూరి జగన్నాధ్, ‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో విజృంభించారు. తన సత్తా చాటారు. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా ప్రచార సమయంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలనే తన మనసులో కోరికను పూరి జగన్నాధ్ బయటపెట్టారు.
‘టెంపర్’ సినిమా విడుదలకు ముందు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్ ఛాయస్ అని ట్వీట్ చేశారు. తన గురువు వర్మ వ్యాఖ్యలపై ఈ దర్శకుడు స్పందిస్తూ.. చిరంజీవిని అభిమానించే వ్యక్తులలో నేను ఒకడిని. చిన్నప్పటి నుండి ఆయనంటే ఇష్టం. మెగాస్టార్ సినిమాలు విడుదలైన సమయంలో కటౌట్, ఫ్లెక్సీలు కట్టేవాడిని. ఒకవేళ చిరంజీవి అవకాశం ఇస్తే మాస్ మసాలా సినిమా తీస్తానని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి, తన 150వ సినిమాకు స్క్రిప్ట్ ఫైనలైజ్ పనిలో బిజీగా ఉన్నారు. పూరి జగన్నాధ్ ఆ గోల్డెన్ ఛాన్స్ సొంతం చేసుకుంటారేమో వేచి చూడాలి.
