‘ముకుంద’ లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తన రెండవ సినిమా కోసం కూడా చాల డిఫరెంట్ కాన్సెప్ట్ నే ఎదురుకున్నాడు. ఆ సినిమానే ‘కంచె’. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఇవి రెండిటి తర్వాత వరుణ్ తేజ్ మూడవ సినిమా పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘లోఫర్’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ టైటిల్ తోనే ఈ సినిమా ఎంత మాస్ గా ఉండనుందనే విషయం మనకు అర్థమవుతోంది.
పూరి జగన్నాధ్ 40 రోజుల పాటు రాజస్థాన్ లోని జైసల్మీర్, జోధ్పూర్ లలో ఈ సినిమాలోని మేజర్ పార్ట్ ని షూట్ చేసారు. రాజస్థాన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం ఇటీవలే గోవాకి షిఫ్ట్ అయ్యిందని తెలియజేశాం. ప్రస్తుతం గోవాలో ఈ చిత్ర టీం వరుణ్ తేజ్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. గోవా బీచ్ లో జరుగుతున్న షూట్ లో కమెడియన్ అలీ కూడా పాల్గొంటున్నాడు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా ఫినిష్ చేసే పూరి షూటింగ్ తో పాటు అక్కడే ఎడిటింగ్ వర్క్ ని కూడా ఫినిష్ చేస్తున్నాడు.
ఈ చిత్ర టీం సెప్టెంబర్ చివరిలోపు ఈ సినిమా షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేయనున్నారు. వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నోర ఫతేహి ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.
