ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్…JGM పై పూరి జగన్నాథ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Published on Mar 30, 2022 1:00 pm IST


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ వరుస సినిమాలకి డైరెక్షన్ చేస్తూ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ హ్యాండ్సం హీరో విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్, ఈ చిత్రం రిలీజ్ కాకముందే మరో సినిమాను అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు. లేటెస్ట్ గా తన సినిమా జన గణ మన ను ప్రకటించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇది నిజంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఎన్నో సంవత్సరాల నుండి ఈ సినిమా ను తెరకెక్కించేందుకు ఎదురు చూస్తున్నా అని, విజయ్ దేవరకొండ వల్ల ఇది సాధ్యం అవుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. ఇది కల్పిత కథ అని, దేశ భక్తి మరియు యుద్ధం కలగలిపిన చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో హీరో ఆర్మీ ఆఫీసర్, ఒక సైనికుడు డ్రీమ్ అని, సిటిజన్స్ మరియు దేశం కోసం అని అన్నారు. అంతేకాక ఈ చిత్రం లో హీరో మిషన్ JGM అని అన్నారు. పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ చిత్రం ను ఆగస్ట్ 3, 2023 లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :