భారతదేశ డిఫెన్స్ మినిస్టర్ ని కలిసిన “జనగణమన” చిత్ర యూనిట్.!

Published on Mar 31, 2022 7:24 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో “లైగర్” అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత కూడా మళ్ళీ ఇదే క్రేజీ కాంబో నుంచి పూరి జగన్నాథ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “జనగణమన” ని రీసెంట్ గానే అనౌన్స్ చెయ్యగా దానిపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

పూరి లోని ఉన్న దేశభక్తికి ప్రతీకగా ప్లాన్ చేసిన ఈ సినిమాని అనౌన్సమెంట్ నుంచే చాలా ఆసక్తికర ప్లానింగ్స్ ను మేకర్స్ చేస్తూ వస్తున్నారు. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్ర యూనిట్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మి తదితరులు భారతదేశ రక్షణా శాఖ మంత్రి అయినటువంటి రాజనాథ్ సింగ్ ని కలవడం ఆసక్తిగా మారింది.

నిన్న సాయంత్రం వారు రాజనాథ్ సింగ్ ని కలవగా ఇప్పుడు ఈ ఫోటోలు బయటకి వచ్చాయి. అయితే పూరి జగన్నాథ్ మాత్రం ఈ ప్లానింగ్స్ తో తన సినిమాపై అందరిలో మరింత గౌరవం వచ్చేలా చేస్తున్నారని చెప్పాలి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :