ఇంటెన్స్ పోస్టర్ తో పూరి – విజయ్ బిగ్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్.!

Published on Mar 29, 2022 2:56 pm IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి భారీ సినిమా “జనగణమణ” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై మేకర్స్ ఈరోజు ఒక భారీ అనౌన్సమెంట్ ని ఇవ్వడానికి రంగం సిద్ధం చెయ్యగా దానిని మేకర్స్ ఆసక్తిగా దేశపు ఆర్మీ జవాన్స్ సమక్షంలో చేసే వినూత్న ప్రయత్నం చేశారు.

మరి ఇప్పుడు ఈ బిగ్ ప్రాజెక్ట్ ని ఒక ఇంటెన్స్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. “జె జి ఎమ్” అంటూ బ్యాక్గ్రౌండ్ లో దేశ సైనికులు మిస్సైల్స్ బ్యాక్గ్రౌండ్ ఇంకా గమనిస్తే మన దేశపు పటం లాంటి ఆకారంతో అదిరే పోస్టర్ ని రిలీజ్ చేసి వదిలారు. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. అలాగే రానున్న రోజుల్లో ఈ భారీ సినిమాపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :