గోవా లో పూరి జగన్నాథ్ పుట్టిన రోజు వేడుకలు!

Published on Sep 28, 2021 6:04 pm IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టిన రోజు వేడుకలు గోవా లో జరిగాయి. ఆత్మీయుల మధ్యన పూరి జగన్నాథ్ తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మేరకు పూరి జగన్నాథ్ కేక్ కట్ చేస్తూ ఉన్న విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో లో చార్మి కౌర్ సైతం బర్త్ డే విషెస్ తెలుపుతూ ఉన్నారు.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరో గా ఒక సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రాన్ని ఐదు బాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం లో ప్రముఖ లెజెండరి బాక్సర్ మైక్ టైసన్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ మొదటి సారి గా పాన్ ఇండియా సినిమా ను చేస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :