నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా పూరీ జగన్నాథ్!

Published on Sep 26, 2022 2:00 pm IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం తర్వాత పూరి తన నెక్స్ట్ మూవీ ను ఇప్పటి వరకూ ప్రకటించలేదు. తన కొడుకు ఆకాష్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి, అయితే దాని పై కూడా క్లారిటీ రాలేదు.

ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ గోవాలో క్యాంప్ వేసుకుని తన కొత్త సినిమా కోసం కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అతను మరియు అతని టీమ్ కొత్త చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను ప్రారంభించారు. మరి పూరీ ఏ హీరోతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారో చూడాలి. పూరీ జగన్నాథ్ నెక్స్ట్ మూవీ ఏ హీరో తో, ఎలాంటి సినిమా చేస్తారో అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :