“జన గణ మన” ను కన్ఫర్మ్ చేసిన పూరి జగన్నాథ్!

Published on Feb 7, 2022 11:01 am IST

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పోర్ట్స్ డ్రామా, లైగర్ సినిమా షూటింగ్ ను నిన్న పూర్తి చేసాడు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రం జన గణ మన పై అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని ఛార్మీ కౌర్ యొక్క ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా వెల్లడించడం జరిగింది. వాయిస్ సందేశాన్ని విడుదల చేశాడు. లైగర్ విడుదలకు ముందే ఈ కొత్త సినిమా షూటింగ్ పూర్తవుతుందని కూడా తెలుస్తోంది. లైగర్ చిత్రం లో మైక్ టైసన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మించిన ఈ పాన్-ఇండియన్ మూవీ ఆగస్టు 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :