పూరి జగన్నాథ్ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఆఫ్ మాస్ కమర్షియల్ మూవీస్’ – కరణ్ జోహార్

Published on Aug 11, 2022 1:30 am IST

టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి మూవీ ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ కొట్టారు. అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ దర్శకుడిగా దూసుకెళ్లిన పూరి, రవితేజతో ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సూపర్ స్టార్ మహేష్ తో పోకిరి, బిజినెస్ మ్యాన్, అల్లు అర్జున్ తో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో, పవన్ తో బద్రి, కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు, ప్రభాస్ తో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, అలానే ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా, టెంపర్ ఇలా వరుసగా అనేక సూపర్ డూపర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.

మధ్యలో కెరీర్ పరంగా ఒకింత తడబడ్డ పూరి ఇటీవల రామ్ తో ఇస్మార్ట్ శంకర్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో ఆయన తీస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ లైగర్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ల కలయికలో తెరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి ఎంతో భారీగా నిర్మించారు. ఛార్మి మరొక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలక రోల్స్ చేస్తున్నారు.

ఆగష్టు 25న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న లైగర్ పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా విపరీతంగా అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్, దర్శకుడు పూరిని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఆఫ్ మాస్ కమర్షియల్ మూవీస్ అని పొగుడుతూ ఒక స్పెషల్ వీడియో బైట్ ని నేడు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. అందులో పూరి తీసిన బ్లాక్ బస్టర్ మూవీస్ వాటిలోని డైలాగ్స్, యాక్షన్ సీన్స్ చూడవచ్చు. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో ప్రేక్షకాభిమానులని ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :