హీరో రవితేజ తో సెట్ చేస్తున్న పూరి ?

హీరో రవితేజ తో సెట్ చేస్తున్న పూరి ?

Published on Dec 4, 2022 11:30 PM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తన కొత్త సినిమా ఉంటుందని ఆ మధ్య బాలయ్య బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పూరి, బాలయ్య కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రాసాడని, అది ఒక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బాలయ్యకి వరుస సినిమాలు ఉన్నాయి. కాబట్టి.. ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా.. వచ్చే ఏడాదికి పోస్ట్ ఫోన్ అయిందట.

ఇక ఈ లోపు హీరో రవితేజతో పూరి జగన్నాథ్ ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్ కి గతంలో భారీ హిట్లు ఇచ్చాడు పూరి. కాబట్టి.. రవితేజ కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించొచ్చు. మరోపక్క బాలయ్య కూడా ఓ సినిమా చేసుకుని రమ్మని పూరికి సలహా ఇచ్చాడు. అందుకే, పూరి కూడా హీరో రవితేజతో తన కొత్త సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. మొత్తమ్మీద లైగర్ ప్లాప్ దెబ్బకు రవితేజ – పూరి సినిమా మళ్లీ సెట్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు