పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రానికి ఇంకా హీరో కన్ఫర్మ్ కాలేదు?

Published on Sep 29, 2022 3:00 am IST


దేశంలోనే టాప్ డైరెక్టర్లలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. అతను తన కెరీర్‌లో సినీ పరిశ్రమ కి కొన్ని బిగ్గెస్ట్ హిట్‌ లను అందించాడు. మరియు లైగర్‌ ప్రేక్షకులను, తన అభిమానులను అందరినీ నిరాశపరిచాడు. అతను తన కొత్త చిత్రం స్క్రిప్ట్ వర్క్ కోసం గోవాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

తన కొడుకుతో తన తదుపరి సినిమా చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయం ఏంటంటే, జగన్ ఇప్పటికి ఏ హీరోని కన్ఫర్మ్ చేయలేదు. అతను తన కొత్త సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే హీరో గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఏదేమైనా పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ప్రకటన కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 123తెలుగు తరపున పూరీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం :