పూరిని బాధపెట్టిన ప్రముఖ టీవీ చానల్

Puri-Jagannadh
చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా వారిని సరికొత్త మాస్ యాంగిల్ లో చూపించడంలో పేరున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. అన్ని విషయాల్లో చాలా ఫ్రాంక్ గా ఉంటూ తన పని తాను చేసుకుపోయే పూరి జగన్నాధ్ పై ఓ ప్రముఖ టీవీ చానల్ ప్రసారం చేసిన ప్రోగ్రాం పూరిని బాగా బాధపడేలా చేసింది. ఇక విషయంలోకి వెళితే కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ అయిన 150వ సినిమాకి పూరి జగన్నాధ్ ని డైరెక్టర్ గా ఫైనలైజ్ చేసారు. అప్పటి నుంచి ఈ సినిమాకి సంబందించిన ఎన్నో విషయాలు వార్తల్లో ఉన్నాయి. ఇది ఓకే చేసిన కొద్ది రోజులకే పూరి జగన్నాధ్ మహేష్ బాబు తను చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే మా కాంబినేషన్ లో మూడవ సినిమా ఉంటుందని పూరి అధికారికంగా తెలియజేశాడు.

ఈ వార్తతో ఓ ప్రముఖ టీవీ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయడం పూరి జగన్నాధ్ కి ఇష్టం లేదు అందుకే మహేష్ బాబుకి కథ చెప్పి ఒప్పించాడనే ఓ కథనాన్ని ప్రసారం చేసారు. ఈ కథనం చూసి బాధ పడిన పూరి జగన్నాధ్ ‘ఇలాంటి బేస్ లేని వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో తెలియడం లేదు.. ఇలాంటి వార్తలని రాయకండి అవి నన్ను బాధపెతతాయి. నాతో పాటు హీరో అభిమానులను తీవ్రంగా బాధపెదతాయని’ పూరి జగన్నాధ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇలాంటి వార్తలు రాయడం సరికాదని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. పూరి – చిరు సినిమా ఆగష్టు 22న ప్రారంభం కానుంది.

Exit mobile version