బాలయ్య కొడితే అదొక లవ్ స్టోరీ – పూరీ జగన్నాథ్

18th, August 2017 - 08:39:55 AM


నిన్న సాయంత్రం ఖమ్మంలో జరిగిన ‘పైసా వసూల్’ వేడుక ఆద్యంతం ఫుల్ జోష్ తో జరిగింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ స్పీచ్ వేడుకకే హైలేట్ గా నిలిచింది. బాలకృష్ణగారితో సినిమా చేశాక ఇన్నాళ్లు ఎందుకు చేయలేదా అని ఫీలయ్యాను. ఇది ఆయన 101వ సినిమా కానీ 1వ సినిమా చేసిన ఎనర్జీతో చేశారు అంటూ బాలకృష్ణ అభిమానిని కొట్టిన వ్యవహారాన్ని ప్రసారవించారు.

‘బయటికొస్తేవేరే హీరోలకు బౌన్సర్లు కావాలేమో. బాలయ్యకు అవసరం లేదు. అయన అభిమానుల్ని ఆయనే కంట్రోల్ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు మీద పడుతుంటే ఆయన కొడుతుంటారు. అలా కొట్టించుకోవడం అభిమానులకు ఎంత ఇష్టమో. అది ఆయనకు అభిమానులకు మధ్య అనుబంధం. బాలయ్య ఎప్పుడైనా కొడితే కామన్ సెన్స్ అనే ఏరియాలో తేడా వచ్చినప్పుడే కొడతారు. భవిష్యత్తులో ఆయన కొడితే అదొక లవ్ స్టోరీ. అంతేగాని సీరియస్ గా తీసుకోవద్దు’ అన్నారు. పూరి మాట్లాడిన ఈ మాటలకు కొందరు ముందుగా షాక్ అయినా ఆయన స్టైల్ ను గుర్తుచేసుకుని ఓకే అనుకుంటున్నారు.